TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సోమవారం మధ్యాహ్నం తిరుపతి పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. 3 గంటలకు తిరుచానూరుకు చేరుకుని అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పిస్తారు.