WG: వాసవి పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి శాంతి ధామంకు ఇవాళ బెంగళూరుకు చెందిన భక్తులు తరలివచ్చారు. అమ్మవారి 90 అడుగుల పంచలోహ విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వాసవి హోమం, గోమాత పూజలలో భక్తులు పాల్గొన్నారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులకు ఆలయ సిబ్బంది అందచేశారు.