E.G: రాజమహేంద్రవరం పేపర్ మిల్ ఏరియాలోని శ్రీలక్ష్మి హెచ్పీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్స్ కార్యాలయాన్ని శుక్రవారం ఏఎస్ఓ నాగంజనేయులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యాస్ సిలిండర్ల బుకింగ్, సరఫరా విధానం, స్టాక్ వివరాలను డిస్ట్రిబ్యూటర్ను అడిగి తెలుసుకున్నారు. బుకింగ్ నమోదు విధానం, డెలివరీ రికార్డులు తదితర వివరాలను పరిశీలించి సంబంధిత సిబ్బందితో మాట్లాడారు.