GNTR: కొల్లిపర మండలం అత్తోటలో తిరుమల శెట్టి గోపికి చెందిన ఆరబెట్టిన ధాన్యంపై దుర్గాభవాని దూడ పేడ వేయడంతో ఆదివారం రెండు కుటుంబాల మధ్య వివాదం చెలరేగింది. ఈ విషయంలో గోపి భార్య వెంకటరత్నం, దుర్గాభవాని కుమారులను నిలదీయగా, అది పరస్పర దాడికి దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకోవడంతో, కొల్లిపర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.