కరీంనగర్‌లోని గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్‌లో 19 శాతం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి, అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. మొత్తం 104 క్లస్టర్లలో పెట్రోలింగ్‌తో పాటు, ఏసీపీ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో స్ట్రైకింగ్ ఫోర్సు చేశామన్నారు.