JGL: స్థానిక ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు వేయాలని జగిత్యాల రూరల్ సీఐ సుధాకర్ పేర్కొన్నారు. రూరల్ మండలం జాబితాపూర్‌లో పోలీస్ సిబ్బంది ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా పోలీస్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో ఎన్నికలంటే భయం పోవాలనే ఈ ర్యాలీ నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.