TG: తొలివిడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మరోవైపు మద్యం షాపులు కూడా మూసివేశారు. ఎలాంటి ఘర్షణలు జరగకుండా ఉండేందుకు మద్యం షాపులను మూసివేశారు. అధికార యంత్రాంగం పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లల్లో నిమగ్నమై ఉంది. పోలింగ్ సామగ్రిని మండల కేంద్రాల్లో ప్రత్యేక గదుల్లో భద్రపరిచారు. బందోబస్తు కోసం పోలీసులను పోలింగ్ కేంద్రాల వారీగా కేటాయించారు.