TG: ఇవాళ జీహెచ్ఎంసీ కమిషనర్‌తో బీజేపీ నేతలు భేటీ కానున్నారు. ప్రధానంగా GHMC వార్డుల పునర్విభజన అంశంపై చర్చించనున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల GHMC పరిధిని విస్తరించి, 27 మున్సిపాలిటీలను విలీనం చేసింది. ఈ నేపథ్యంలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.