NLG: తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెంలో పోలీస్ శాఖ స్థానిక సంస్థల ఎన్నికల నియమాలు, శాంతి భద్రతలపై మంగళవారం అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా డీఎస్పీ శివరాం రెడ్డి పాల్గొని, ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని, నియమావళి ఉల్లంఘనపై ఎవరినీ వదలబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శంకర్, సీఐ కొండల్ రెడ్డి, ఇతర పోలీసు సిబ్బంది హాజరయ్యారు.