KKD: ప్రత్తిపాడు మండలం పెద శంకర్లపూడి టీడీపీ కార్యాలయంలో సోమవారం MLA వరుపుల ప్రభ ఆధ్వర్యంలో CVAP కమిటీ సమీక్ష సమావేశం జరిగింది. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం రూపొందిస్తున్న P4 కార్యక్రమంపై విస్తృతంగా చర్చించారు. ప్రతి గ్రామానికి స్పష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర నివేదికలు తయారు చేయాలని సిబ్బందికి ఆదేశించారు.