‘గాడ్ సేవ్ ది క్వీన్’ గీతం ద్వారా బ్రిటిష్ వారు భారత్‌ను అణచివేశారని మోదీ అన్నారు. ‘బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా బంకిం చంద్ర ఛటర్జీ వందేమాతర గీతాన్ని రచించారు. ఈ గీతం దేశానికి స్వాతంత్య్రం సాధించే శక్తినిచ్చింది. దేశాన్ని బానిసత్వ సంకెళ్ల నుంచి విముక్తి కల్పించేందుకు నినదించిన గీతం వందేమాతరం. దేశం మొత్తం ఈ గీతం స్ఫూర్తితో ఏకమైంది’ అని పేర్కొన్నారు.