ASF: దహెగాం మండలంలోని హత్తిని, దహెగాం గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా BJP అభ్యర్థులకు మద్దతుగా సోమవారం MLA హరీష్ బాబు ప్రచారాన్ని నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమని, అలాగే జాతీయ ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు, డ్రైన్లు నిర్మించేది కూడా కేంద్ర ప్రభుత్వమేనన్నారు. BJP అభ్యర్థులను గెలిపించాలని కోరారు.