BDK: టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో సోమవారం ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులను అధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా నాయకులు పనిచేయాలని పిలుపునిచ్చారు.