KMM: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఖమ్మం రూరల్ ఏసీపీ తిరుపతి రెడ్డి సోమవారం తెలిపారు. కూసుమంచిలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బరిలో ఉన్న అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున గ్రామాల్లో అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నిబంధనల మేరకు ప్రచారం నిర్వహించుకోవాలని తెలిపారు.