NDL: పగిడ్యాల నుంచి నంది కొట్కూరు వరకు రూ. 4 కోట్ల నిధులతో బీటి రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే గిత్త జయసూర్య నేడు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, అభివృద్ధే కూటమి లక్ష్యం అన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో రోడ్డు, కూటమి ప్రభుత్వంలో పూర్తి చేయడం ద్వారా నాకు సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్, నాయకులు ఆర్&బీ అధికారులు పాల్గొన్నారు.