ఈ నెల 5న రిలీజ్ కావాల్సిన ‘అఖండ 2’ మూవీ ఫైనాన్షియల్ ఇష్యూ వల్ల వాయిదా పడింది. తాజాగా ఈ అంశంపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించాడు. ఈ మూవీ ఇష్యూ క్లియర్ అయిందని తెలిపాడు. ఈ నెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందన్నాడు. దీనిపై త్వరలోనే మేకర్స్ అప్డేట్ ఇస్తారని పేర్కొన్నాడు. ఇక నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో ఈ సినిమా తెరకెక్కింది.