రోజూ పెదాలకు లిప్‌బామ్ రాసుకోవడం వల్ల అవి నల్లగా మారడం, పొడిబారిపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. బయటకెళ్లినప్పుడు మాస్క్ ధరించడం లేదా స్కార్ఫ్‌తో పెదాలను కవర్ చేయాలి. రాత్రి పడుకునే ముందు పెదాలకు ఆలివ్ నూనె రాసుకుంటే ఫలితం ఉంటుంది. పెదాలను నాలుకతో అద్దడం, పంటితో కొరకడం వంటివి చేయకూడదు. రాత్రి పడుకునే ముందు పెదాలకు తేనె రాసి మరుసటి రోజు ఉదయం కడిగితే ప్రయోజనం ఉంటుంది.