GNTR: దేశ సరిహద్దుల్లో మన ప్రజల రక్షణకు కవచంలా నిలబడే సైనికుల సేవ, త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సోమవారం పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సైనికులు, వారి కుటుంబాలకు సమాజంలోని ప్రతి ఒక్కరూ కృతజ్ఞులై ఉండాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.