ADB: నేరడిగొండ మండలం సావర్గవ్ సమీపంలో గల శివాలయంలో జరుగుతున్న రామకోటి సంకీర్తన కార్యక్రమం సోమవారం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్థానికులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో అందరూ కలిసికట్టుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని MLA అనిల్ జాదవ్ పేర్కొన్నారు.