‘వారణాసి’ గ్లింప్స్‌లో ప్రతి షాట్ తనను షాక్‌కు గురిచేసిందని దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పాడు. అంత క్రియేటివ్‌గా ఉంటుందని తాను ఊహించలేదన్నాడు. ప్రతి ఫ్రేమ్ టైం ట్రావెలర్లా అనిపించిందని, రాజమౌళి నుంచి మరో అద్భుతం రాబోతుందని తెలిపాడు. గ్లోబ్ ట్రాటర్ వేడుకలో మహేష్ ఎంట్రీ ప్లాన్ చూసి తనకు మాటలను రాలేదని, ఇలాంటి క్రియేటివ్ ఐడియాలు రాజమౌళికే వస్తాయని అన్నాడు.