మెదక్ జిల్లాలో మూడు విడతల నామినేషన్ ప్రక్రియ పూర్తైంది. మొదటి విడతలోని ఆరు మండలాల్లో ఈ నెల 11న పోలింగ్ ఉండడంతో అభ్యర్థులు ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. రెండో విడత నామినేషన్ల ఉపసంహరణ ముగిసి గుర్తుల కేటాయింపు పూర్తయింది. దీంతో అభ్యర్థులు ప్రచారం ప్రారంభించారు. మూడో విడత ఉపసంహరణ గడువు ఈ నెల 9తో ముగియనుంది.