గుంటూరులో STU జిల్లా వార్షిక కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో STU స్టేట్ కౌన్సిలర్‌గా వీరాంజనేయులు ఎన్నికయ్యారు. వీరాంజనేయులు కాకుమాను (M) బోడిపాలెం MPPS ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. జిల్లా ఆర్థిక కార్యదర్శిగా హనుమంత ప్రసాద్ ఎన్నికయ్యారు. ఈయన కొమ్మూరు MPPS ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. వీరిని పలువురు ఉపాధ్యాయులు సోమవారం అభినందించారు.