కోనసీమ: అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న సీతాపతిరావుపేటలో ఆదివారం ఒక ఆగంతకుడు మహిళా మెడలో గొలుసులు లాక్కెళ్లాడు. దీనిపై బాధితురాలు అమలాపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. ఉదయం ఇంటిముందు ఉండగా ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.