SKLM: అమడాలవలస ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇవాళ అంతర పాఠశాల 69వ బాల బాలికల గ్రిగ్గ్స్ పోటీలను స్థానిక ఎమ్మెల్యే కూన రవి కుమార్ ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. క్రీడల వల్ల విద్యార్థుల్లో మానసిక, శారీరక ఉల్లాసం పెరగడం మాత్రమే కాక భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడా రంగాల్లో నిలదొక్కుకునే అవకాశాలు విస్తారంగా ఉన్నాయని తెలిపారు.