JGL: మెట్పల్లి పట్టణంలో సోమవారం నిర్వహించిన అయ్యప్ప ఆరట్టు ఉత్సవం ఊరేగింపులో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. స్వాములతో కలిసి భజన చేశారు. అనంతరం పట్టణంలోని కోనేరులో స్వామివారికి నిర్వహించే చక్రస్నానం కోసం పాదయాత్రగా స్వాములతో కలిసివెళ్లారు.