వందేమాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా లోక్సభలో ప్రత్యేక చర్చ జరుగుతోంది. ప్రధాని మోదీ సభలో మాట్లాడుతూ.. వందేమాతరంపై చర్చ జరుపుతున్నందుకు సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన ఈ గీతంపై చర్చ జరపడం మన అందరి అదృష్టమని అన్నారు. ఈ చర్చ.. చరిత్రతో ముడిపడిన అనేక ఘట్టాలను మన కళ్ల ముందుకు తీసుకువస్తుందన్నారు.