NGKL: జిల్లాలో 154 అంగన్వాడీ టీచర్లు, 974 ఆయా పోస్టులు ఖాళీలు ఉన్నాయి. పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించినట్లు మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి రాజేశ్వరి సోమవారం తెలిపారు. ఖాళీ పోస్టుల కారణంగా గ్రామాలలో అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే పోస్టులు భర్తీ చేస్తామన్నారు.