JGL: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలో జరుగుతున్న మల్లన్న స్వామి వారి జాతర మహోత్సవంలో కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మల్లన్న స్వామి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.