KDP: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా కడపలోని పోలీస్ పరేడ్ మైదానంలో మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, 2వ అదనపు జడ్జి సత్యకుమారి విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా అర్పించిన అమరులైన పోలీసులకు నివాళి అర్పించి వారి సేవలను కొనియాడారు. అమరవీరుల కుటుంబాలను పరామర్శించి యోగ, క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.