అన్నమయ్య: RGUKT- AP పరిధిలోని 4 IIIT( ఇడుపులపాయ, నూజివీడు, శ్రీకాకుళం, ఒంగోలు) సంబంధించి 6వ స్నాతకోత్సవం నూజివీడు IIIT వేదికగా ఈ నెల 27న నిర్వహించనున్నట్లు ఉపకులపతి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణరావు తెలిపారు. RGUKT 2022 నుంచి 2025 వరకు బీటెక్ చదువు పూర్తి చేసుకున్న విద్యార్థులకు డిగ్రీ పట్టాలు అందించనున్నట్లు వివరించారు.