NTR: గంపలగూడెం(M) ఆర్లపాడు వాస్తవ్యులు కొండ్రు వెంకట కృష్ణ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేశారు. అనంతరం మంచి మార్కులు సాధించేందుకు విద్యార్థులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగవరపు రామకృష్ణ రావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.