కృష్ణా: ఆగిరిపల్లి గ్రామంలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. వారి చిత్రపటాలకు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం నేత సత్తుకోటేశ్వరరావు మాట్లాడుతూ ఎందరో త్యాగదనులు త్రుణప్రాయంగా ప్రాణార్పణ చేసి భారత స్వతంత్రానికి వన్నెతెచ్చినట్లు చెప్పారు. వారి స్ఫూర్తితో దేశభక్తి పెంపొందాలన్నారు.