అనకాపల్లి: ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధిలో తాగునీటి సరఫరా ఏ విధంగా జరుగుతుందో మున్సిపల్ మంచినీటి విభాగం ఏఈ గణపతిరావు మంగళవారం ఉదయం పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలో నెహ్రునగర్ ప్రాంతంలో మంచినీటి సరఫరాపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వేసవిలో మంచినీటి సరఫరాకు ఆటంకం కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.