KDP: తల్లిదండ్రులు మందలించారని యువకుడు హార్పిక్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. మదనపల్లి పట్టణం నీరుగట్టువారి పల్లి రాజా నగర్లో ఉంటున్న బన్నీ(19) జులాయిలతో తిరుగుతున్నాడని తల్లిదండ్రులు మందలించారు. ఈ కారణంగా మనస్థాపం చెందిన యువకుడు ఇంట్లో ఉన్న హార్పిక్ తాగాడు. తల్లిదండ్రులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు.