ASR: జి.మాడుగుల మండలంలోని గాంధీనగర్ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రం బయట స్లిప్పులు దర్శనమిచ్చాయి. సోమవారం గణితం పరీక్ష అయిన తర్వాత విద్యార్థులు బయటకు వచ్చి స్లిప్పులు బయట జల్లుకుంటూ వెళ్లిపోయారు. విద్యార్థులు బయటకు వెళ్లేటప్పుడే ఇలా స్లిప్పులు ఉంటే లోపల ఇంకేమి జరుగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు.