W.G: వినోదం కోసం అత్యధికంగా ఆదరింపబడిన కళలలో నాటిక ఒకటని నేడు అది కనుమరుగవుతుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. సోమవారం రాత్రి వీరవాసరం కళాపరిషత్ సేవా సంఘం నిర్వహిస్తున్న 11వ అఖిల భారత స్థాయి నాటికల పోటీలను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.