ATP: ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ సీల్డ్ టెండర్లు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పంచాయితీ కార్యదర్శి గౌస్ సాహెబ్ తెలిపారు. షీల్డ్ టెండర్లకు సంబంధించిన వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. నిన్న నిర్వహించిన సీల్డ్ టెండర్లు అనివార్య కారణాలతో అర్ధాంతరంగా నిలిపివేశారు. కార్యాలయం వద్ద గందరగోళం నెలకొనడంతో వాయిదా పడింది.