WGL: నేటి నుంచి 27 వరకు వరంగల్లోని నక్కలపల్లి రోడ్డులో రాష్ట్రస్థాయి రైతు ఉత్పత్తిదారు సంఘాల మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ సత్యశారదా దేవి ఒక ప్రకటనలో తెలిపారు. స్మాల్ ఫార్మర్స్ అగ్రి బిజినెస్ కన్సార్టియం, రాష్ట్ర వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 3రోజులు ఈ మేళా ఉంటుందని పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.