W.G: ప్రతి ఒక్కరు దైవచింతన కలిగి ఉండాలని తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. సోమవారం సాయంత్రం తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని చిన్న మసీదులో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. తొలుత ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులు అన్నదమ్ముల్లా జీవనం సాగిస్తారన్నారు.