NDL: బేతంచర్ల ఏపీ మోడల్ స్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు డా.గంగుల నాగరాజుకు అరుదైన అవకాశం దక్కింది. డోన్ పర్యటనలో భాగంగా నేడు సీఎం చంద్రబాబు పాల్గొనే సభకు వ్యాక్యాతగా జిల్లా ఉన్నతాధికారులు ఆయనను ఎంపిక చేశారు. గతంలో నంద్యాల గణతంత్ర వేడుకల్లో తన వాగ్దాటితో ఆయన అందరిని ఆకట్టుకున్నారు. కాగా, ఈ ఎంపికపై తోటి ఉపాధ్యాయులు, అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.