SKLM: ప్రభుత్వం నిర్వహిస్తున్న జాబ్ మేళాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ పేర్కొన్నారు. బుధవారం ఆముదాలవలస పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో APSSDC ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాని ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా నిరుద్యోగులకు కాల్ లెటర్లను అందజేశారు.