KDP: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ జీఎస్టీ ఎగవేతపై ఆ శాఖ అధికారులు సీరియస్గా ఉన్నారు. ఎగ్జిబిషన్, మార్కెట్, షాపు రూముల లీజుదారులు, కాంట్రాక్టర్ల నుంచి జీఎస్టీ బకాయిలు పెద్ద మొత్తంలో పేరుకుపోయాయి. సుమారు రూ.కోటికి పైగా జీఎస్టీ బకాయిలున్నాయి. వీటి కోసం ఇటీవల పలుమార్లు మున్సిపల్ అధికారులను ఆశాఖ అధికారులు కలిశారు.