అన్నమయ్య: రాజంపేట మండలం కొత్త బోయినపల్లి ZP హైస్కూల్ విద్యార్థి పట్నం రెడ్డి సాయి, గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించే ‘ప్రేరణ ఉత్సవ్’ అనే జాతీయ స్థాయి కార్యక్రమానికి ఎంపికయ్యాడు. ఈ ఉత్సవం విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించడం, భారతీయ సంస్కృతి, విలువలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. హెచ్ఎం భారతి ఈ విషయాన్ని సోమవారం తెలిపారు.