E.G: రాజానగరం నియోజకవర్గం దోసకాయలపల్లి గ్రామంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సందర్శించారు. ఈ ప్రమాదంలో సర్వం కోల్పోయిన జుత్తుక సుబ్రహ్మణ్యాన్ని పరామర్శించారు. ఈ ప్రమాదంలో 40 మేకలు పక్కనే ఉన్న గడ్డివాము దగ్ధమైనట్లు స్థానికులు తెలిపారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రూ. లక్ష నగదును అందించారు.