W.G: ఈనెల 31న దేశంలో తొలి కేంద్ర కార్మిక సంఘం ఏఐటీయూసీ 105వ వ్యవస్థాపక దినోత్సవాన్ని కార్మిక సంఘాలు ఘనంగా నిర్వహించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు కోనాల భీమారావు పిలుపునిచ్చారు. గురువారం తణుకు సత్యనారాయణ స్పిన్నింగ్ మిల్స్ వద్ద జరిగిన వర్కర్స్ యూనియన్ సమావేశంలో భీమారావు మాట్లాడారు. ఏఐటియుసీ పతాకాలను ఆవిష్కరించాలని కోరారు.