KRNL: గృహ నిర్మాణ లబ్ధిదారుల సమస్యల పరిష్కారం కోసం గురువారం ‘డయల్ యువర్ పీడీ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీడీ చిరంజీవి తెలిపారు. ఉదయం 10 నుంచి 11 గంటల వరకు 08518-257481 నంబరుకు ఫోన్ చేసి స్టీల్, సిమెంట్ సరఫరా, బిల్లుల బకాయిలపై సందేహాలు నివృత్తి చేసుకోవచ్చన్నారు. వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.