ELR: జిల్లా వ్యాప్తంగా మిగిలి ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలోని సీట్ల భర్తీ కోసం ఈ నెల 8వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీసీఓ రెసిడెన్షియల్ భారతి గురువారం తెలిపారు. 6,7 తరగతులకు ఉదయం 10 గంటల నుండి 11.30 గంటల వరకు 8,9,10 తరగతులకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 3.30 వరకు నిర్వహించబడుతున్నన్నారు.