SKLM: పలాస టీడీపీ కార్యాలయంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ వేడుకలలో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి గౌతు శ్యామసుందర శివాజీ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగుజాతిని తెలుగు గౌరవాన్ని కాపాడిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని పేర్కొన్నారు.