GNTR: తెనాలి డివిజన్లో విషజ్వరాలు ప్రబలుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 25 పడకలతో కూడిన ప్రత్యేక జ్వరాల వార్డును ఏర్పాటు చేశారు. రోగుల సౌకర్యార్థం, వార్డు వద్దకే టెక్నీషియన్లు వెళ్లి శాంపిల్స్ సేకరించాలని ఆదేశాలు జారీ చేశారు. అట్లాగే తురకపాలెంలో సేకరించిన శాంపిల్స్‌కు కూడా ఇక్కడే పరీక్షలు నిర్వహిస్తున్నారు.