VZM: జిల్లాలో జాతీయ కుష్ఠు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 17వ తేదీ నుంచి 30 వరకు కుష్టు వ్యాధిని గుర్తించడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. జిల్లాలో కుష్ఠు వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఇంటిని సర్వే చేయడానికి ఆరోగ్య సిబ్బంది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.